వరుణా.. నీకిది తగునా..!?
హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో విజయవిహారం చేయడం చూసి ఎన్ని సీజన్లయిందో! ఆ లోటు తీర్చడానికా అన్నట్టు సన్ రైజర్స్ తాజా సీజన్ లో గెలవడం ఓ అలవాటుగా మార్చుకుంది. అభిమానులను శక్తివంచనలేకుండా అలరిస్తోంది. స్వంతమైదానం ఉప్పల్ లో అయితే సన్ రైజర్స్ శత్రు దుర్బేద్యంగా కనిపిస్తున్నారు. ఇక్కడాడిన ఐదు మ్యాచ్ ల్లోనూ జయకేతనం ఎగురవేశారు.
అయితే, నేడు సన్ రైజర్స్ ఉప్పల్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. అచ్చొచ్చిన గ్రౌండ్ లో ధోనీ సేన పనిపడతారనుకుంటే, ఉప్పల్ లో ఈ సాయంత్రం కురిసిన భారీ వర్షం మ్యాచ్ నిర్వహణను డైలమాలో పడేసింది. అక్కడ భారీ వర్షం కురవడంతో మైదానం జలమయమైంది. దీంతో, మ్యాచ్ పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.